గణేశ్ మండపాల అనుమతులకు సింగిల్ విండో పోర్టల్ ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి ఉత్సవాల కోసం గణేశ్ మండపాల అనుమతులను సులభతరం చేస్తూ ఏపీ పోలీసులు 'గణేశ్ ఉత్సవ్ సింగిల్ విండో' పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. నిర్వాహకులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. www.ganeshutsav.net ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకుని క్యూఆర్ కోడ్ పొందవచ్చు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, భద్రత దృష్ట్యా ఈ డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేశామని అధికారులు స్పష్టం చేశారు.