బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన యశ్ 'టాక్సిక్' మూవీ

రిపోర్టర్: హరి స్థలం: India

యశ్ నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరుస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు రూ. 101 కోట్లు వసూలు చేసినప్పటికీ, ఆ తర్వాత భారీగా పడిపోయింది. 11వ రోజు నాటికి కేవలం రూ. 0.84 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 241.89 కోట్లకు పరిమితమయ్యాయి.