రాజకీయ లబ్ధి కోసమే ఉన్మాదికి జగన్ మద్దతు అంటూ గళ్లా మాధవి ధ్వజం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

రాజకీయ లబ్ధి కోసమే చావుబతుకుల మధ్య ఉన్న విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాదిని జగన్ రెడ్డి కాపాడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే గళ్లా మాధవి మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, నిందితుడిని రక్షించేందుకు వైకాపా లాయర్లతో హైకోర్టులో పిల్ వేయించారని దుయ్యబట్టారు. బాధితురాలిని పరామర్శిస్తూనే మరోవైపు నేరస్థుడికి మద్దతుగా మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.