సమగ్ర సర్వేపై విమర్శలు తగదంటూ కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన బీజేపీ తెలంగాణ
రిపోర్టర్: విజయ్
స్థలం: Telangana
ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయిన ఇండియా కూటమి పక్షాలు సర్వే ప్రక్రియపై విమర్శలు చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ వెల్లడించింది. గతంలో కాంగ్రెస్ హయాంలో సైతం సర్వే ప్రక్రియ జరిగిందని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం ఆ పార్టీ నైజమని విమర్శించారు. కొత్తగా బ్యాలెట్ పేపర్ గురించి మాట్లాడటం పూర్తిగా హాస్యాస్పదమని పేర్కొంటూ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఆ పార్టీ నేతల తీరును తీవ్రంగా ఖండించారు.