రామాయణంలో రణ్‌బీర్ కపూర్‌ ఎంపికపై శివ్ సాగర్ అసంతృప్తి

రిపోర్టర్: సురేష్ స్థలం: India

నితీష్ తివారీ తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్‌ను ఎంపిక చేయడంపై ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ మనవడు శివ్ సాగర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'యానిమల్' చిత్రంలో నటించిన రణ్‌బీర్‌ను రాముడిగా అంగీకరించలేమని, ఇలాంటి పవిత్ర పాత్రలకు ఎలాంటి ఇమేజ్ లేని కొత్త నటులను లేదా ఫ్రెష్ ఫేస్‌లను తీసుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.