పోలీసుపైనే మందుబాబుల ప్రతాపం: వర్ధన్నపేట హేమ బార్‌లో ఖాకీపై దాడి!!!

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

చట్టం, శాంతిభద్రతలంటే మందుబాబులకు లెక్కేలేకుండా పోయింది. వర్ధన్నపేట పట్టణంలోని హేమ బార్ అండ్ రెస్టారెంట్ లో నిన్న రాత్రి తాగి గొడవ పడుతున్న యువకులను వారించేందుకు వచ్చిన డయల్ 100 కానిస్టేబుల్‌పైనే మందుబాబులు విరుచుకుపడ్డారు ఇరువర్గాల ఘర్షణ పెద్దది కావడంతో డయల్ 100కు సమాచారం అందగా, అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. మద్యం మత్తులో ఊగిపోతున్న యువకులు ఆ కానిస్టేబుల్ ట్యాబ్ పగలగొట్టి, నెట్టివేసి కొట్టడం తీవ్ర కలకలం రేపింది.

బార్ సిబ్బంది సమాచారంతో ఎస్సై సాయిబాబా సంఘటనా స్థలానికి చేరుకునే సరికే దాడికి పాల్పడిన రౌడీ మూకలు పరారయ్యాయి.

విధులు నిర్వహిస్తున్న పోలీసుపైనే దాడి జరగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా,

పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఆకతాయిల కోసం వేట ప్రారంభించారు. ఖాకీ చొక్కాపైనే చెయ్యి చేసుకున్న వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.