నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణల కలకలం: అప్పీళ్లను స్వీకరించిన జిల్లా అధికారులు
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
స్థానిక సంస్థల ఎన్నికల నామపత్రాల పరిశీలనలో తిరస్కరణకు గురైన అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్రెడ్డికి అప్పీళ్లు చేసుకున్నారు. ప్రాదేశిక ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం మరియు రిజర్వు నిబంధనలు పాటించకపోవడంతో పలువురి నామినేషన్లను అధికారులు తిరస్కరించినట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. కొత్తవలస, తెర్లాం స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థుల కుల ధ్రువీకరణపై వైకాపా ఫిర్యాదు చేయడంతో పాటు, వివిధ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.