ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ వంశ్ బేదికి మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి సంప్రదింపులు ఎదురుకావడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక క్రికెటర్ తనను ఫిక్సింగ్ కోసం సంప్రదించినట్లు వంశ్ బేది వెంటనే యాంటీ కరప్షన్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై మార్గదర్శకం కోరుతూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి లేఖ రాసింది.