నెల్లూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర దంపతులు, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ కృష్ణుని జీవన విధానంపై రూపొందించిన పుస్తకాన్ని బీద రవిచంద్ర ఆవిష్కరించారు. తరాలు మారినా శ్రీకృష్ణుడి సందేశాలు, ఆయన చూపిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు.