జీరో ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులకు కేసీఆర్ ఎలా ఎదిగారు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని 2004 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న కేసీఆర్ సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులకు ఎలా ఎదిగారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ దబాయిస్తున్నారని, నాటి అఫిడవిట్‌లో కేసీఆర్ తప్పులు రాసి మోసం చేశారా లేక ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా అని ఆయన నిలదీశారు.