వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలిపోయిందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శివ స్థలం: కడప

కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, ఈ దారుణానికి పాల్పడిన అంతిమ లబ్ధిదారులు ఎవరో స్పష్టంగా తేలిపోయిందని ఆయన వెల్లడించారు. రూ. 40 కోట్ల సుపారీ ఒప్పందంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజం నిప్పులాంటిదని, నిప్పుతో చెలగాటమాడితే ఎప్పటికైనా కాలిపోవడం ఖాయమని హెచ్చరించారు.