వనపర్తిలో దళిత యువకుడికి ఆలయ ప్రవేశ నిరాకరణ ఘటన కలకలం
రిపోర్టర్: గోపి
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా మంగంపల్లి గ్రామంలో దళిత యువకుడిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపుతోందని బాధితుడు మాసాని సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆలయంలోకి తమను రానీయకుండా దుర్భాషలాడారని, ఎమ్మెల్యే మేఘా రెడ్డి హామీ ఇచ్చినా తమను మోసం చేశారని ఆయన వాపోయారు. కుల వివక్షతో జరుగుతున్న ఈ అన్యాయంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.