లింగరాజుపల్లి స్టేజీ వద్ద కార్ల ఢీ: స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం లింగరాజుపల్లి స్టేజీ వద్ద సోమవారం ఉదయం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న కారు, తొర్రూరు వైపు నుంచి వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కారు పల్టీ కొట్టగా, రెండు కార్లలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.