చంద్రబాబు పాలనపై గోబెల్స్ ప్రచారం అంటూ జగన్ మండిపాటు
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారాన్ని మించి చంద్రబాబు పాలన సాగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఇస్తున్నారని, దుష్ప్రచారాలు, అబద్ధాలు, అన్యాయమైన కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.