భారత్‌లో ప్రారంభమైన నైరుతి రుతుపవనాల తిరోగమనం
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
భారతదేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలం ముగింపు దశకు చేరుకోగా, పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఈ ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని, జూన్ 4న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు జులై 9 నాటికి దేశమంతటా విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది.