వైద్య సేవల వైఫల్యం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు తప్పని తిప్పలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విజయనగరం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అస్తవ్యస్తంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, రాజాం, నెల్లిమర్ల ఆసుపత్రుల్లో భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారని అధికారులు తెలిపారు. సరైన వసతులు లేక వరండాలలోనే వైద్యం అందిస్తున్న దుస్థితి నెలకొందని, తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.