భారీ వర్షాల కారణంగా సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో దాదాపు నలభై వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీనివల్ల సుమారు నలభై కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. గనుల్లో నిలిచిన నీటిని తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయి.