అయోధ్య విరాళాల దుర్వినియోగం: సిట్ ఛార్జిషీట్ దాఖలైందని సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అయోధ్య
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఛార్జిషీట్ దాఖలు చేసిందని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఇక దీని విచారణ స్థానిక కోర్టులోనే కొనసాగుతుందని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారని, ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.