వాట్సాప్ దీపావళి గిఫ్ట్ మోసం: నకిలీ లింక్ లపై హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
ప్రధాని మోదీ పేరుతో వాట్సాప్‌లో వచ్చే ఎనిమిది వేల రూపాయల దీపావళి బహుమతి సందేశాలు పూర్తిగా మోసపూరితమైనవని ప్రజలను హెచ్చరిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ చేశారు. అటువంటి నకిలీ లింక్‌లపై క్లిక్ చేస్తే ఆధార్ మరియు బ్యాంకు వివరాలు చోరీకి గురై యూపీఐ మోసాలు జరిగే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ లేదా యూపీఐ పిన్ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని, అధికారిక వెబ్సైట్లలో మాత్రమే సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని సూచించారు.