రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డి మానుకోవాలి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్ నగర్
రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానుకోవాలని ఎంపీ డి.కె. అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహబూబ్ నగర్ రాజకీయ అంశాలపై ఆమె స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం తగదని ఆమె హితవు పలికారు. ఈ వ్యవహారంపై అధికార వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.