కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తయారీలో మోటోరోలా నిమగ్నం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
ప్రముఖ టెక్ సంస్థ మోటోరోలా సరికొత్త వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. లీకైన డిజైన్ స్కెచ్‌ల ప్రకారం ఈ ఫోన్‌లో మడత లేని స్క్రీన్, ప్రత్యేకమైన ల్యాండ్‌స్కేప్ కెమెరా మాడ్యూల్, 3D గ్లాస్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని నిపుణులు భావిస్తున్నారు.