శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: సీఐ బుద్దే స్వామి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్‌లో గణపతి నవరాత్రుల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. భారీ విగ్రహాల కంటే చిన్న విగ్రహాలను ప్రతిష్టించి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని సీఐ బుద్దే స్వామి సూచించారు. శోభాయాత్రలో మద్యం సేవించి గొడవలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.