'సకల కళలకు ఆదిగురువు విశ్వకర్మ': Tirupati Police నివాళి
రిపోర్టర్: రమేష్
స్థలం: Tirupati
సకల కళలకు ఆదిగురువు, దేవశిల్పి అయిన విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిల్పులు, కార్మికులు సమాజ అభివృద్ధికి అందించే సేవలు మరువలేనివని ఈ సందర్భంగా Tirupati Police వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.