అభివృద్ధి, డబ్బుతోనే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు: ఎమ్మెల్యే గంటా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఎన్నికల్లో గెలుపు కోసం అభివృద్ధి, సంక్షేమం, డబ్బు మాత్రమే సరిపోవని, నాయకుడి భరోసానే కార్యకర్తలను నడిపిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెదేపా లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబును అందరూ రోల్‌మోడల్‌గా తీసుకోవాలని సూచించారు. గతంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓడిపోయామని, కేవలం డబ్బు ప్రభావంతోనే గెలుస్తామనుకోవడం సరైనది కాదని ఆయన విశ్లేషించారు.