హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం రేవంత్ ఆదేశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీ హిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. అలాగే తాగునీటిని ఆదా చేసేందుకు ఎస్టీపీల్ లో శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా వినియోగించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.