పైలట్లకు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: భారతదేశం

విమాన ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు డీజీసీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని కమర్షియల్ ఎయిర్‌లైన్స్ పైలట్లందరికీ తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జులై నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే ఏ పొరపాటునూ సహించేది లేదని స్పష్టం చేసింది.