స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన కేంద్ర మంత్రి మన్సుఖ్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలోని శ్రమ్ శక్తి భవన్ వద్ద నిర్వహించిన ఒకరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మందవియ స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు అని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రత్యేక ప్రచారం ఆరు కింద చేపట్టిన ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్వయంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇచ్చారు.