దానం నాగేందర్ అనర్హత తీర్పుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వపు ద్వంద్వ వైఖరిని నడిరోడ్డుపై ఎండగట్టిందని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీలిచ్చిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.