పరిగిలో భూసేకరణ నిరసిస్తూ ఆందోళన చేపట్టిన రైతుల అర్ధరాత్రి అరెస్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: వికారాబాద్

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్పారంటూ రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.