యువ నిర్మాత ఎస్కేఎన్ చేతుల మీదుగా ధరణి ఐ లవ్ యు ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడు సాయి కృష్ణ కేవీ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ధరణి ఐ లవ్ యు ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఆవిష్కరించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. వంశీ, మహిత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ మద్దికుంట నిర్మాతగా వ్యవహరిస్తుండగా, పద్మనాబ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. పోస్టర్ ఆసక్తికరంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించాలని ఎస్కేఎన్ ఆకాంక్షించారు.