రజనీకాంత్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటి నయనతార

రిపోర్టర్: నరేష్ స్థలం: చెన్నై

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ధర్మన్ చిత్రంలో నటి నయనతార ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకు కథాగమనంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఐదేళ్ల విరామం తర్వాత రజనీకాంత్ సరసన నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.