విద్యార్థిని బెత్తంతో తీవ్రంగా కొట్టిన ఉపాధ్యాయుడు.. జలదంకిలో విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జలదంకి

నెల్లూరు జిల్లా జలదంకి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి చలంచర్ల చైతన్యను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఏసుదాసు బెత్తంతో కొట్టిన ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు సక్రమంగా రాకపోవడం, అసైన్మెంట్లు చేయకపోవడంతోనే మందలించినట్లు ఉపాధ్యాయుడు వివరణ ఇచ్చారు. అయితే శరీరంపై వాతలు పడేలా కొట్టడం సరికాదని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడైన ఉపాధ్యాయుడికి ఇంచార్జ్ హెచ్ఎం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.