గోదావరి ఉగ్రరూపం భద్రాచలం వద్ద నలభై అడుగులకు నీటిమట్టం
రిపోర్టర్: సురేష్
స్థలం: భద్రాచలం
గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోందని, భద్రాచలం వద్ద నీటిమట్టం నలభై అడుగులకు చేరిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం ఐదు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్కులుగా కొనసాగుతోందని వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసర సహాయం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని అధికారులు హెచ్చరించారు.