స్థానిక ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు స్పష్టత: అధికారులను ఆశ్రయించవచ్చని వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో అవరోధాలు ఎదురైతే ఎన్నికల అధికారులను ఆశ్రయించవచ్చని అభ్యర్థులకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థుల వినతులపై గడువులోపు తగిన ఉత్తర్వులు జారీచేయాలని అధికారులకు సూచించినట్లు న్యాయమూర్తి జస్టిస్ ఎం.కిరణ్మయి గురువారం వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ అనంతరం ఈ మేరకు కోర్టు స్పష్టతనిచ్చింది.