స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఆటోమొబైల్ మరియు మెటల్ రంగాల షేర్లపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో ప్రధాన సూచీలు పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచెక్స్ సెన్సెక్స్ 143.21 పాయింట్లు కోల్పోయి 73,709 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 77.60 పాయింట్లు క్షీణించి 22,811 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల పతనం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది.