మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: గాంధీ విగ్రహానికి జనసేన నేత నివాళి

రిపోర్టర్: sankar p స్థలం: మునుబోలు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం గాంధీ చేసిన త్యాగాలను ఆయన కొనియాడారు. మహాత్ముని ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.