ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కాంగ్రెస్
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ సెంట్ ఆంటోనీ స్కూల్ వద్ద ఉన్న 103, 104 బూత్ లలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ సేవా దళ్ జిల్లా మాజీ చైర్మన్ బండి రాము మాట్లాడుతూ, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఎస్ఎస్సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ వంటి డాక్యుమెంట్లను సమర్పించి వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.