సర్వేపల్లిలో తెదేపా దూకుడు: వైకాపాను వీడి పార్టీలో చేరిన ముప్పై ఆరు కుటుంబాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: సెంటిమెంట్

సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురానికి చెందిన ముప్పై ఆరు దళిత, గిరిజన కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. అల్లీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మల్లికార్జునపురం తన దత్తత గ్రామమని, అక్కడ జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.