హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరో కేసులో అరెస్ట్ యత్నం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ బొల్లారం పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు బనాయించి, అక్కడి నుంచి అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నించడం తీవ్ర దుమారానికి దారితీసింది. న్యాయస్థానపు రక్షణ ఉన్నప్పటికీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.