గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ పై అభ్యంతరాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు ఎల్. రమణ, శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా తానేబాలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై ఆయనతో చర్చించి, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.