ఢిల్లీలో కాలుష్య ముప్పు: విద్యా సంస్థల నిర్వహణపై సీఏక్యూఎం స్పష్టత

రిపోర్టర్: సురేష్ స్థలం: ఢిల్లీ

గ్రాప్ రెండో దశ నిబంధనల అమలు నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలల మూసివేతపై ఎలాంటి ఉత్తర్వులు లేవని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. వాయు నాణ్యత మరింత క్షీణించిన దశల్ లో మాత్రమే ఆన్లైన్ తరగతులకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యలపై తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.