బెంగళూరులో యువతులు ఆటో డ్రైవర్ మధ్య రోడ్డుపై ఘర్షణ
రిపోర్టర్: నరేష్
స్థలం: Bengaluru
బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ప్రయాణ ఛార్జీ విషయంలో యువతులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మేరకు రోడ్డుపైనే వారు పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయినట్లు పోలీసులు తెలిపారు. యువతులు మద్యం మత్తులో తనను దూషించి ఛార్జీ ఇవ్వకుండా గొడవకు దిగారని ఆటో డ్రైవర్ ఆరోపించగా, బాధితుల ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.