'నా ఆస్తులపై అబద్ధాలు చెప్పారు.. సీఎంపైనే మాకు నమ్మకం లేదు': రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
ఎన్నికల అఫిడవిట్ లో తాను పేర్కొన్న ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత మండిపడ్డారు. తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నాయని సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసలు ఈ ముఖ్యమంత్రి మాటలపైనే తమకు ఎలాంటి నమ్మకం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.