దేవాలయాల్లో అన్నదానం పెంపు: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Chennai
తమిళనాడులోని ప్రముఖ పది దేవాలయాల్లో ఉచిత అన్నదాన పథకాన్ని వంద శాతం పెంచుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి సి. రమేష్ తెలిపారు. కాంచీపురం జిల్లా కుంద్రత్తూరులోని ఆలయంలో ఈ విస్తరించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత అసెంబ్లీ సమావేశాల హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీని ద్వారా ఏడాదికి అదనంగా రెండు లక్షలకు పైగా భక్తులకు లబ్ధి చేకూరుతుందని, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.