1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న 1980s రెట్రో ఫోటో ట్రెండ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ ట్రెండ్ పేరుతో వ్యక్తిగత ఫోటోలను పంచుకోవద్దని, థర్డ్-పార్టీ యాప్స్ లేదా అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం వల్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదముందని స్పష్టం చేశారు.