పచ్చదనంకై ఇంటంటా మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన చైర్పర్సన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలో వన మహోత్సవంలో భాగంగా 17వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ గాదెపాక రవీందర్, మున్సిపల్ అధికారులు, వార్డ్ ప్రజలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.