మణిపూర్‌లోని సినాయ్ క్యాంప్‌లో కలకలం: నకిలీ గుర్తింపులతో తిరుగుతున్న పదిహేడు మంది అరెస్ట్
రిపోర్టర్: విజయ్
స్థలం: Manipur
మణిపూర్‌లోని సినాయ్ క్యాంప్‌లో సంయుక్త భద్రతా బలగాలు జరిపిన మెరుపు దాడిలో కుకీ సాయుధ గ్రూపుల సభ్యులుగా నటిస్తున్న పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు పౌరుల హత్య ఘటన తర్వాత ఈ క్యాంప్ తీవ్ర వివాదంలోకి ఇరుక్కుంది.