స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ సమయంలో మార్పు: తెలిపిన కార్పొరేటర్ జగన్నాథం

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డు పరిధిలో క్రీడాకారుల కోసం నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం ప్రారంభోత్సవ సమయంలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా వేసినట్లు స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం ఒక ప్రకటనలో స్పష్టంగా వెల్లడించారు. ఈ మార్పును స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.