మెగాస్టార్ విశ్వంభర సినిమా ఆలస్యంపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజీవ్ కనకాల
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
విశ్వంభర సినిమా విడుదల ఆలస్యం కావడానికి అసలు కారణాలను నటుడు రాజీవ్ కనకాల స్పష్టం చేశారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ పనులు అత్యుత్తమంగా రావాలనే ఉద్దేశంతోనే ఈ జాప్యం జరుగుతోందని ఆయన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగినట్లుగా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని రాజీవ్ కనకాల వెల్లడించారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతోంది.