తోటపల్లి కుడి కాలువలో స్నానానికి దిగి బ్యాంకు ఉద్యోగి గల్లంతు
రిపోర్టర్: హరి
స్థలం: సీతానగరం
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన బ్యాంకు ఉద్యోగి ముదుకోటి హేమంత్ కృష్ణ పార్వతీపురంమన్యం జిల్లా సీతానగరం మండలం ఏగోటివలసలో తోటపల్లి కుడి కాలువలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్నేహితుడి కుమార్తె బారసాల వేడుకకు వచ్చిన ఆయన కాలువలో నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. తహసీల్దారు, ఎస్సై మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.